‘ఏం వదినా, ప్రయాణం బాగా జరిగిందా? ఏమే కోడలుపిల్లా ఎలా ఉన్నావు? మా ఊరు నచ్చిందా’ అంటూ నవ్వుతూ వాళ్ళందరికీ దిష్టితీసింది అనన్య అత్తయ్య. ‘అత్తా బాగున్నాను, మీరెలా ఉన్నారు?’ అని నవ్వుతూ సమాధానమిచ్చి ఇల్లంతా కలయ దిరిగింది. ‘అబ్బ! నిజంగా పచ్చటి పంట పొలాల మధ్య ఆ ఊరి లాగే ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉంది ఇల్లు’ అనుకుంది.
‘ఏం అత్తయ్యా కులాసాగా ఉన్నావా’ అంటూ నవ్వుతూ అమ్మని పలకరించిన బావ శ్రవణ్*ని చూసి నోటమాట రానిదానిలా ఉండిపోయింది అనన్య. ‘అబ్బా బావ ఎంత బావున్నాడు. అచ్చు మిల్కీ బాయ్*లా ఉన్నాడు. ఇతనిమీద ఈ ఊళ్ళో ఎంత మంది అమ్మాయిలు మనసు పారేసుకున్నారో’ అని అను మానంగా అతనికేసి చూసింది. ‘బావా! నేను వచ్చా, ఇంక నీ ఆటలు సాగవు’ అని మనసులోనే నవ్వుకుని తనకు కేటాయుంచిన గదిలోకి వెళ్ళింది. ఆ గది చూసి ఎంతో ఆశ్చర్యపోయింది. చిన్నప్పుడు బావకు తను పంపిన బొమ్మలు, గ్రీటింగ్* కార్డులను ఇన్ని సంవత్సరాలైనా ఒక్కటికూడా పారెయ్యకుండా ఎంతో చక్కగా, దాచిపెట్టాడు ఆ రూములో. తనంటే బావకు ఇష్టమేనన్నమాట అనుకుంటూ మనసులోనే పొంగిపోయింది అనన్య.
ఆరోజు రాత్రి భోజనాలయ్యాక వెన్నెల్లో డాబా మీద ఒంటరిగా ఉన్న శ్రవణ్* దగ్గరకొచ్చిన అనన్య ‘అవును బావా నువ్వు గోల్డ్* మెడలిస్టువని అమ్మ చెప్పింది. హాయిగా ఎంబీఏ చేసి మంచి ఉద్యోగం చేసుకోకుండా ఎందుకీ వ్యవసాయం’ అని నవ్వుతూ అడిగింది. ‘చిన్నప్పటి నుండి వ్యవసాయం అంటే నాకు ఎంతో ఇష్టం అనన్యా. అందరూ ఉద్యోగాలు చేస్తే ఇంక పంటలు పండించేదెవరు?’ నవ్వుతూ అన్నాడు శ్రవణ్*. ‘వావ్*! యు ఆర్* గ్రేట్* బావా!’ అంటూ షేక్*హ్యాండ్* ఇచ్చింది అనన్య.
💘 Telugu Sex Stories,Telugu Incest Stories,Telugu Boothu Kathalu.
మనసుకు ఇష్టమైనవారితో అందమైన వెన్నెల్లో గడపడంలో ఎంతో థ్రిల్లుందన్న విషయాన్ని డాబా మీదకొచ్చిన కొద్ది నిమిషాల్లోనే తెలుసుకుంది అనన్య. ‘నిన్నొక విషయం అడుగుతాను, ఏమనుకోవుగా బావా’ అంది నవ్వుతూ. ‘ఏ విషయమైనా నాకు తెలిస్తే తప్పకుండా చెబుతాను’ నవ్వుతూ సమాధానమిచ్చాడు శ్రవణ్*. ‘అబ్బా బావ నవ్వుతుంటే అచ్చు హీమాన్* నవ్వు తున్నట్టుంది’ మనసులో అనుకుని, ‘ఏం లేదు బావా ‘ప్రేమ’ గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఎటో చూస్తున్నట్టు సిగ్గుగా ప్రశ్నించింది. ‘అబ్బో ఇది చాలా ఫాస్టే!’ మనసులోనే అనుకున్న శ్రవణ్* ‘చూడు అనన్యా ప్రేమంటే ఓ రెండు మనసుల కలయిక. అలాగే ఇద్దరు కలిసి చేసే ఓ జంట ప్రయాణం. ఆ ప్రయాణానికి గమ్యంకన్నా గమనం ముఖ్యం. అర్థంచేసుకుని నడిచి నప్పుడే వారిప్రేమ కొత్త చిగుళ్ళు వేస్తూ, అను నిత్యం కొత్తగా, నూతనంగా కనబడుతుంది. రోజు రోజుకి ఎంతో బలపడుతుంది.ప్రేమ బంధానికి పునాది నమ్మకం. అది లేన ప్పుడు దానికి అర్థం లేదు. ఇంక ఆ ప్రేమికుల మధ్య ఏ అనుబంధమూ లేనట్లే. సూర్యోదయానికీ, చంద్రోదయానికీ ఓ టైము ఉంటుంది. అలాగే నక్షత్రాలు కనిపించడానికీ ఓ టైముంది. కానీ ప్రేమ కలగడానికి ఓ టైమంటూ ఉండదు. అదే ప్రేమలోని గొప్ప దనం. ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా ఎందుకు పుడుతుందో చెప్పడం చాలాకష్టం. అందుకే నా దృష్టిలో ప్రేమంటే ఓ ‘భావన’. అన్నదమ్ముల ప్రేమ, భార్యా భర్తల ప్రేమ, ప్రేమికులమధ్య ప్రేమ… ఇలా ప్రేమ ఎన్నో రకాలు. అసలు ప్రేమంటే స్వార్థం లేకపోవడమే. ప్రేమను పంచితే పెరుగుతుందే తప్ప ఎప్పటికీ తరగదు’ నవ్వుతూ చెప్పాడు శ్రవణ్*.
‘అవునూ, ఏంటి సంగతి ప్రేమ గురించి తెలుసు కోవాలనుకుంటున్నావు! కొంపదీసి ఎవరినైనా ప్రేమిస్తున్నావా?’ మళ్ళీ తనే కొంటెగా అడిగాడు. ‘నిన్నే ప్రేమిస్తున్నాను బావా’ అని చెబుదామనుకున్న అనన్యకు ధైర్యం చాల్లేదు. ‘అబ్బే అదేం లేదు. ఊరికే సరదాగా అడిగాను అంతే!’ అంది. ‘ఔను, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా’ అంది కాస్త భయంగా. ‘ఇంతవరకులేదు, అయినా పెళ్ళిముందుకన్నా, పెళ్ళైన తర్వాతే అసలైన ప్రేమ పుడుతుంది.
💘 Telugu Sex Stories,Telugu Incest Stories,Telugu Boothu Kathalu.
అటువంటి ప్రేమ కలకాలం ఉంటుంది కూడా’ అన్నాడు శ్రవణ్*. ‘అబ్బో! పల్లెటూరి వాడైనా ప్రేమగురించి ఎంత చక్కగా చెప్పాడు. నిజమే, ప్రేమన్నది ఒక భావనే’ అనుకుంటూ మెచ్చుకోలుగా చూస్తూ ఉండిపోయింది అనన్య. ఇంకా ఏదో అడగాలనుకున్నంతలో, ‘అన్నయ్యా అత్త పిలుస్తోంది’ అంటూ పల్లవి పానకంలో పుడ కలా రావడంతో ‘ఆ వస్తున్నా’ అంటూ వెళ్ళిపోయాడు శ్రవణ్*. ఇక అతని మనసులో భావాలు అప్పటికి తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది అనన్యకి.
తెల్లటి లంగా, ఆకుపచ్చ ఓణీ, పొడవాటి వాల్జడతో ఓరోజు సాయంత్రం మావయ్య పొలం చూడ్డానికి బయలుదేరింది అనన్య. కన్నార్పకుండా తన వైపే చూస్తున్న శ్రవణ్*ని ‘ఏంటి బావా కొరుక్కు తినేస్తావా?’ అంటూ నవ్వింది అనన్య. ‘ఈ లంగా ఓణీలో ఎంత సూపర్*గా ఉన్నావో తెలుసా’ బైకు తీస్తూ అన్నాడు శ్రవణ్*. ఆ మాటలకు మనసులోనే ఆనందపడింది అనన్య. వెనుక కూర్చుని భుజం మీద చెయ్యివేసి ‘ఊ.. పద బావా’ అనడంతో ఇద్దరూ పొలంకేసి బయలుదేరారు.
పొలంగట్ల మీద నడుస్తున్న అనన్య అమెరికా విశేషాలు ఎంతో ఉత్సాహంగా చెబుతోంది. ఆకాశం నల్లటి మబ్బులతో నిండి, జోరుగా వాన కురిసేందుకు సిద్ధంగా ఉంది. బలంగా వీస్తున్న గాలికి వరి పైరులు తలలు ఆడిస్తూ ఆనందంగా ఊగుతున్నాయి. పచ్చటి పరుపుల్లాంటి ఆ పంట పొలాలు చూసి మైమరిచిపోయింది. ‘బావా ఇంతచక్కటి వాతావరణాన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదు’ అంటూ అటునుండి ఇటువైపు బోదెగట్టుమీద గెంత బోయింది.
కాలుజారి బోదెలోపడి పూర్తిగా తడిసి పోయింది. ‘అందుకే అనన్యా, చేల గట్లమీద జాగ్రత్తగా నడవాలి’ అంటూ ఆమెకు చెయ్యిచ్చి పైకిలేవ దీయబోయి శ్రవణ్* కూడా బ్యాలెన్స్* తప్పడంతో ఇద్దరూ ఒకరిమీద మరొకరు పడిపోయారు. అలా పడ్డంలో అనన్యమీద పడ్డాడు శ్రవణ్*. ‘అమ్మ బావా! నువ్వింకా ఎంతో అమాయకుడి వనుకున్నా. పర్వా లేదే నీకు తెలివుంది’ అంటూ అతని అధరాలను తన పెదవులతో మెల్లిగా స్పృశిస్తూ అంది అనన్య.
💘 Telugu Sex Stories,Telugu Incest Stories,Telugu Boothu Kathalu.
అయ్యో నాకా ఉద్దేశం లేదు. నన్ను నమ్ము అంటూ కంగారుగా లేవబోయిన శ్రవణ్*ని కదల నివ్వకుండా ఇంకాగట్టిగా వాటేసుకుని ‘అబ్బా బావా నీకంతా కంగారేం, ఇక్కడెవరున్నారని భయపడు తున్నావు. మరేం ఫర్వాలేదు. నేను ఎవరికీ చెప్పనులే’ అంటూ అతని బుగ్గమీద మరోసారి ముద్దు పెట్టింది అనన్య. ‘అయ్యో బావా ఇప్పుడెలా? వాన మొదలైంది’ అంది భయంగా. ‘నువ్వేం కంగారు పడకు పద. పక్కనే మంచె ఉంది’ అంటూ ఆమెను ‘మంచె కాడకు’ తీసుకొచ్చాడు శ్రవణ్*. తడిసిన బట్టల్లో ఆమె ఒంటి అందాలు చూస్తూ నోటమాట రాని వాడిలా ఉండిపోయాడు.
బావ చూపులు ఎక్కడెక్కడో గుచ్చుకున్నాయి అనన్యకు. ‘ఏంటి చూపులతోనే తినేస్తావా’ అంది సిగ్గు పడుతూ.‘నీతో పరిచయం ఇంత చక్కగా మొదలౌతుందని నేను ఏనాడూ ఊహించలేదు. చాలా థాంక్స్* బావా! అంది. అతని చేయిపట్టుకుని మంచెకింద మంచం దగ్గరకు వెళుతుంటే, అంతలోనే ఓ పెద్ద శబ్దం చేస్తూ మెరుపు మెరిసింది. భయపడి అతని గుండెలకు హత్తుకుపోయింది. ఆర్తిగా అతన్ని వాటేసుకుని ‘బావా ఇప్పుడెన్ని ఉరుములురిమినా నాకింక భయంలేదు’ అంది. మెల్లిగా మంచం మీదకు తోస్తూ అతన్ని ముద్దులతో ముంచెత్తింది.అసలే వానకితడిసి వణుకుతున్న శ్రవణ్* ఒంటికి జతకలిసిన ఆమె వెచ్చదనం హాయి నిచ్చింది. ఆమెనింకా తనమీదకు లాక్కుంటూ ఆమె అధరాలు చుంబిస్తూ మునివేళ్లతో నడుమును మీటుతూ ఆమెను ఇంకా రెచ్చగొట్టాడు.ఆ చలిలో తనువులవేడి పంచుకుంటూ ఆత్రంగా ఒకరినొకరు పెనవేసుకుంటూ ఎంతో ఆనందం అనుభవిస్తున్నారు. ‘బావా ప్లీజ్* డు మి సంథింగ్*’ అంటూ అతని చెవిలో హస్కీగా అంది అనన్య. ఏదో చెయ్యబోతున్న సమయంలో సడన్*గా ఆమెను పక్కకునెట్టి మంచంమీదనుండి లేచి నిలబడ్డాడు శ్రవణ్*. ‘బావా.. వాట్*హేపెండ్*.. కమాన్*, డోన్ట్* స్టాప్*…!’ అంటూ చొరవగా అతని చేయి పట్టుకుంది అనన్య.
💘 Telugu Sex Stories,Telugu Incest Stories,Telugu Boothu Kathalu.
చేతిని విదిలించుకుని ‘సారీ అనన్యా… ఐయామ్* రియల్లీ సారీ.. ఇలా ప్రవర్తించినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది’ చొక్కా గుండీలు పెట్టుకుంటూ అన్నాడు శ్రవణ్*.‘వాట్*.. ఇందులో సిగ్గు పడేందుకేముంది… మనిద్దరం వయసులో ఉన్నాం. దట్సాల్*.. డోన్ట్* బి పూలిష్*’ భుజా లెగరేస్తూ క్యాజువల్*గా అంది అనన్య.
‘విదేశాల్లో పెరిగిన నీకు ఇది తప్పు కాకపోవచ్చు. కానీ పెళ్ళి కాకుండా ఇలా ఓ అబ్బాయి అమ్మాయి కలవడం మన దేశంలో చాలా తప్పు. భారతీయ స్త్రీకి ‘శీలం’ ముఖ్యం. అందుకే దాన్ని ఎంతో పవిత్రంగా కాపాడు కుంటూ, పెళ్ళైన తొలిరేయి భర్తకు ఆనందంగా అర్పించుకుంటారు’ చెప్పాడు శ్రవణ్*. ‘వావ్* బావా నువ్వు చాలా గ్రేట్*. అందివచ్చిన అవకాశం వినియోగించుకోకుండా భారతీయ సంస్కృతి గొప్పదనం మరోసారి రుజువుచేశావు. ఇదే మరొకరైతే.. అమ్మో తలుచుకోవడానికే భయంగా ఉంది. ఓకే, నువ్వు చెప్పినట్టు నీ కోసం అన్నీ పదిలంగా దాచి, మన పెళ్ళైన తర్వాత ఆనందంగా అర్పిస్తాను సరేనా..’ అంది అనన్య నవ్వుతూ. ఆమె మాటలు అర్థం చేసుకుని ‘సరే అప్పుడే చూపిస్తాను ఈ పల్లెటూరి అబ్బాయి తడాఖా’ అన్నాడు శ్రవణ్* నవ్వుతూ. ‘బావా! నీకో విషయం చెప్పనా! మేం అమెరికాలో ఉన్నా మన కట్టుబాట్లు మర్చిపోలేదు. అమ్మా నాన్నా నీ గురించి ఎంతో గొప్పగా చెబుతుంటే ఏమో అనుకున్నాను. కాని అది నువ్వు ఇవాళ రుజువు చేశావు. థాంక్స్* బావా, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చెయ్యలేదు’ అనడంతో హాయిగా నవ్వుకున్నారు ఇద్దరూ. అంత వరకూ తాము అనుభవించిన తడిపొడి ముద్దుల తియ్యదనాన్ని తల్చుకుంటూ, తడిపొడిగా ఇంటికి బయలుదేరారు.
💘 Telugu Sex Stories,Telugu Incest Stories,Telugu Boothu Kathalu.